ఎంపీలతో వైఎస్‌ జగన్‌ కీలక చర్చలు

YS Jagan's key talks with MPs

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ప్రజాసంకల్పయాత్రలో తాను విడిది చేసిన శిబిరం వద్ద ఎంపీలతో చర్చిస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల గ్రామంలో ఈ భేటీ జరుగుతోంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి. విజయసాయిరెడ్డి, వరప్రసాద్‌, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో పార్లమెంటులో తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో వైఎస్‌ జగన్‌ చర్చిస్తున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరింత ఉధృతం చేయడం, హోదాకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టడం, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలకు సలహాలు, సూచనలివ్వనున్నారు.