పెట్రో ధరలపై మోడీని ఎందుకు ప్రశ్నించరు: పొన్నం

Why do not you ask Modi on petrol prices?

హైదరాబాద్‌ : జోనల్‌ విధానాన్ని ప్రధాని మోడీతో కొట్లాడి సాధించానన్న సీఎం కేసీఆర్‌ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెట్రో ధరలపై ఎందుకు ప్రశ్నించరని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కేసీఆర్‌ ఢిల్లీలో మోడీ కాళ్లు మొక్కి ఇక్కడ నిలదీస్తానంటాడని పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మోడీ రూపాయి విలువ తగ్గడంపై చేసిన వ్యాఖ్యలు అరుంధతీ నక్షత్రాల్ని చూపినట్లుందన్నారు. నోట్ల రద్దుతో ఈ పరిస్థితి వస్తుందని నాడే మన్మోహన్‌ చెప్పారనీ, అప్పుడు ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టిన మోడీ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర తగ్గినా ఎందుకు పెట్రో ధరలు తగ్గించడం లేదో మోడీ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Source by vvartha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *