విశాల్‌ నామినేషన్‌కు ఆమోదం

Vishal nominated for nomination

దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాజకీయంగా తమిళనాడు ఎప్పుడూ సంచలనమే. తాజాగా ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కీలక మలుపు తిరిగింది. నటుడు విశాల్‌ నామినేషన్‌కు ఎట్టకేలకు ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని విశాల్‌ స్వయంగా తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘సుదీర్ఘ పోరాటం తర్వాత ఆర్కేనగర్‌ ఎన్నికలకు సంబంధించిన నా నామినేషన్‌కు ఆమోదముద్ర పడింది. సత్యం జయించింది’ అంటూ ట్వీట్‌ చేశారు.

తొలుత విశాల్‌ సమర్పించిన నామినేషన్‌ పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయని, అందుకే తిరస్కరించామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి స్పష్టం చేశారు. 300 మంది అనుచరులతో కలిసి సోమవారం సాయంత్రం చివరి నిమిషంలో విశాల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆర్కేనగర్‌ నియోజవర్గంలో ఆయన గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం చర్చనీయాంశమైంది. అయితే తన నామినేషన్‌ తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ సినీనటుడు విశాల్‌ ఆర్కేనగర్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఉద్దేశ పూర్వకంగానే తన నామినేషన్‌ తిరస్కరించారని, దీని వెనుక కుట్ర ఉందని విశాల్‌ ఆరోపించారు. అయితే పలు చర్చల అనంతరం ఎన్నికల అధికారులు విశాల్‌ నామినేషన్‌కు ఆమోదం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *