విశాల్‌తో జతకడుతున్న తమన్నా

పక్కా కమర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు దర్శకుడు సుందర్‌.సి. ఇక తనదైన మాస్‌ సినిమాలతో కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు తేజం విశాల్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘మదగజరాజ’ చిత్రం తెరకెక్కింది. అయితే కొన్ని కారణాలతో ఆ చిత్రం విడుదల కాలేదు. ఆ తర్వాత ‘ఆంబల’ను తెరకెక్కించారు. అది కూడా ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో మూడో సినిమాకు సిద్ధమవుతోంది ఈ కాంబినేషన్‌. ఈ సినిమా ద్వారా మళ్లీ జతకట్టనున్నారు విశాల్‌, తమన్నా. గతంలో వీరిద్దరూ కలిసి ‘కత్తిసండై’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అమ్మడుకు గత రెండు సంవత్సరాలుగా తమిళంలో అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పుడు సుందర్‌.సి చిత్రంతో మళ్లీ తన ప్రత్యేకతను చాటుకోవడానికి సిద్ధమవుతోంది తమన్నా. 2019 జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. అంతలోపు శింబు హీరోగా ‘అత్తారింటికి దారేది’ రీమేక్‌ను పూర్తి చేయనున్నారు సుందర్‌.సి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *