మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కబోతోంది

Venkatesh, Varun Tej

Venkatesh, Varun Tej

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కబోతోంది. అనిల్‌ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఎఫ్‌2’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫన్‌, ఫ్రస్టేషన్‌.. అనేది ఉప  శీర్షిక. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం చిత్రలోగోను విడుదల చేశారు. జులై నుంచి చిత్రీకరణ  మొదలు కానుంది. త్వరలో ఇతర నటీనటుల వివరాలు   తెలియజేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. వెంకటేష్‌ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తుండగా,  సంకల్ప్‌  రెడ్డితో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్‌. ‘రాజా ది గ్రేట్‌’ తర్వాత అనిల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.