రాంచరణ్ రంగస్థలం

Ramcharan Rangastalam Review

Ramcharan Rangastalam Review

రంగస్థలం…1985
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కొత్త పుంతలు తొక్కుతోంది..అవును..నిజం..మన స్టార్ హీరోలు సరైన సినిమాలు చేయడం లేదు అనేవారికి సరియైన సమాధానం రాంచరణ్ రంగస్థలం… రాంచరణ్ లాంటి స్టార్ హీరో ఒక సాదాసీదా చెవుటివాడి పాత్ర…చిట్టిబాబు పాత్ర…తాను ఈ పాత్రను ఎంతగా ప్రేమించాడో మొదటి షాట్ నుండే మనకు అర్ధమవుతుంది..ఎనభైల్లో లుంగీ కట్టుకుని తిరిగే కుర్రాడిలా, అచ్చమైన గోదారి యాసతో, పూర్తి గడ్డంతో…ఇలా ఒకటేమిటి అసలు అన్ని విషయాల్లో చిట్టిబాబు జీవించాడనే చెప్పాలి..చరణ్ లో ఇంత బెస్ట్ పెరఫార్మర్ ఉన్నాడా అని అనిపించక మానదు..ఇకపోతే లెక్కల మాస్టర్ సుకుమార్ మొదటిసారి ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా మనల్ని ఆలోచింపజేయకుండా పూర్తి పల్లెటూరి కథను అందరికీ అర్ధమయ్యే రీతిలో మనకందించాడు…రంగస్థలాన్ని రక్తి కట్టించాడు…ఇక్కడ మూడో వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి..ఆర్ట్ డైరెక్టర్ సబ్బాని రామకృష్ణ దంపతులు గురించి..ఈ చిత్రానికి ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఎనభైల నాటి వాతావరణమే..ఈ సినిమాలో అందరికన్నా ఎక్కువ కష్టపడింది మాత్రం ఆర్ట్ డిపార్ట్మెంట్ వారే..1980 నాటి గోదావరి పల్లెటూరు..పెంకుటిళ్లు, పెచ్చులూడిన ప్రహరీ గోడలు,ఆనాటి చావిడీలు అబ్బా నిజంగా మనల్ని ఆ కాలంలోకి రంగస్థలం అనే ఊళ్ళోకి తీసుకెళ్లారు ఈ సినిమాకు పనిచేసిన వారందరూ..ఇంతమంచి కథకు రత్నవేలు, దేవిశ్రీప్రసాద్ లు తోడైతే ఏం జరుగుతోందో అదే జరిగింది..పాటలు అన్నీ బాగున్నాయి.. రంగమ్మత్త గా అనసూయ రూపంలో మనకు మంచి నటి దొరికింది..మొదటిసారి సమంత ఒక పల్లెటూరి పడుచు పాత్రలో ఇరగదీసింది..ఇక మైనస్ లు చూస్తే ద్వితీయార్థంలో కొంచెం నిడివి బాగా ఎక్కువ అయినట్టు కనబడింది..కొన్ని సీన్లలో తమిళ వాసనలు కనబడ్డాయి ముఖ్యంగా ఆది అంతిమయాత్ర సీన్ లో చాలా ఎక్కువగా..మొత్తానికి రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా ఒక పిరియాడికల్ సినిమాను మనకందించడంలో సుకుమార్ టీమ్ సక్సెస్ అయ్యారు..హీరో, హీరోయిన్, విలన్ ,కేరెక్టర్ ఆర్టిస్టులు ఇవేవీ లేకుండా కేవలం పాత్రలు మాత్రమే కనిపించే సినిమా..రంగస్థలం.