విడుదలకు ముందే ‘అజ్ఞాతవాసి’ రికార్డు

pavan kalyan 'Anonymous' record before the release

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలతోనే ‘అజ్ఞాతవాసి’ రికార్డు సృష్టించనుంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఈ సినిమాను భారీగా స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్‌ సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. దీంతో గతంలో ఏ తెలుగు చిత్రమూ విడుదల కాని రీతిలో అమెరికాలోని 209 ప్రాంతాల్లో ‘అజ్ఞాతవాసి’ని విడుదల చేయటానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
గతంలో ‘బాహుబలి2’ 126 ప్రాంతాల్లో, ఖైదీ నంబర్‌ 150ని 74 లొకేషన్లలో, కబాలి.. 73 లొకేషన్లలో ఆమీర్‌ఖాన్‌ ‘దంగల్‌’ 69 లొకేషన్లలో విడుదల చేశారు. ఇప్పుడు ఆ రికార్డులను ‘అజ్ఞాతవాసి’ తిరగరాసింది. ఏకంగా డబుల్‌ సెంచరీని దాటేసింది. హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పవన్‌ ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *