కోహ్లీ సత్తా.. సౌరభ్ పొగడ్త..

Kohli Satta .. Saurabh praises ..

విదేశీ గడ్డపై సిరీస్‌లు సొంతం చేసుకుంటేనే కోహ్లీ గొప్ప సారథి అవుతాడని భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ అన్నాడు. వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సొంతం చేసుకుని ఆస్ట్రేలియా రికార్డును సమం చేసిన కోహ్లీపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ.. ‘కోహ్లీ గెలిచిన సిరీసుల్లో ఎక్కువ శాతం సొంతగడ్డపైన జరిగినవే. విదేశాల్లో జరిగే సిరీసుల్లో విజయం సాధిస్తేనే మన సత్తా తెలుస్తోంది. త్వరలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ సిరీస్‌ దక్కించుకుంటే కోహ్లీ గొప్ప సారథి అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని వివరించాడు.
‘విదేశీ గడ్డపైనా కోహ్లి సత్తా చాటుతాడనే అనుకుంటున్నా. అతను గొప్ప క్రికెటర్‌ మాత్రమే కాదు మంచి నాయకుడు కూడా. అతని నాయకత్వంలోని టీమిండియా విజయాలు సాధిస్తోంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై ఆయా దేశాల్లో సిరీస్‌లు గెలవాలి. అప్పుడే అతని సామర్థ్యాలను అంచనా వేయగలం. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనలో మన జట్టు మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నా. అతను సాధించిన తొమ్మిది టెస్టు సిరీసుల్లో శ్రీలంక, వెస్టిండీస్‌పై మాత్రమే ఆయా గడ్డపై విజయం సాధించారు. మిగతావన్ని భారత్‌లో జరిగినవే. సొంతగడ్డపై కోహ్లీ 90 శాతం రుజువు చేసుకున్నాడు. ఇక విదేశీ గడ్డలపై నిరూపించుకోవాల్సి ఉంది’ అని గంగూలీ అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *