టీ20లకు కోహ్లీ విశ్రాంతి.. సిరాజ్‌కు దక్కిన చోటు

Kohli rested for the T20s

దక్షిణాఫ్రికా వెళ్లే భారత జట్టు ప్రకటన
శ్రీలంకతో వన్డే సిరీస్‌తో పాటు టీ20 సిరీస్‌కు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించనున్నాడు. డిసెంబరు 10 నుంచి భారత్‌-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఆ తర్వాత డిసెంరు 20 నుంచి మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది. వన్డే జట్టును బీసీసీఐ గత సోమవారం ప్రకటించగా కోహ్లీకి విశ్రాంతి కల్పించి కెప్టెన్‌ బాధ్యతలను రోహిత్‌ శర్మకు అప్పగించింది.
తాజాగా టీ20 సిరీస్‌ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ ఇందులోనూ కోహ్లీకి విశ్రాంతినిచ్చింది. రోహిత్‌ శర్మకే మరోసారి కెప్టెన్సీ పగ్గాలను అందించింది. అలాగే హైదరాబాద్‌ కుర్రోడు మహమ్మద్‌ సిరాస్‌ మరోసారి టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు సిరాజ్‌ తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కేరళకు చెందిన తంపి, హరియాణాకు చెందిన దీపక్‌ హుడా తొలిసారి భారత జట్టులోకి ఎంపికయ్యారు.
శ్రీలంకతో టీ20 సిరీస్‌ అనంతరం రెండు రోజుల వ్యవధిలోనే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్‌ ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు ఆడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ రెండు జట్లను గత సోమవారమే ప్రకటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ రోజు వెల్లడించింది.
టీ20 జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శ్రేయ్యస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ, హార్దిక్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌, బసిల్‌ తంపి, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌.
టెస్టు జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), మురళీ విజయ్‌, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, పుజారా, రహానె(వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, సాహా(వికెట్‌కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా, పార్దీవ్‌, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, బుమ్రా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *