ఎయిర్‌టెల్‌తో ఇంటెక్స్‌ భాగస్వామ్యం రూ.1,649కే 4జీ స్మార్ట్‌ఫోన్‌

intex-airtel

చౌకధరలో 4జీ స్మార్ట్‌ఫోన్లను అందించేందుకు ఇంటెక్స్‌తో జట్టుకట్టినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ నెలవారీ అద్దెపథకంతో సహా తీసుకుంటే, ఈ ఫోన్‌ ధర రూ.1,649 అవుతుంది. 4 అంగుళాల తెర, 1జీబీ ర్యామ్‌, 8 అంతర్గత మెమొరీ (128 జీబీకి పెంచుకునే వీలు), వెనుక 2 మెగాపిక్సెల్‌ కెమేరా, ముందు వీజీఏ కెమేరా కలిగిన ఇంటెక్స్‌ ఆకా లయన్స్‌ ఎన్‌1 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.3,799 కాగా, ఖాతాదారులు ముందస్తుగా రూ.3,149 చెల్లించాలి. తదుపరి నెలకు రూ.169 చొప్పున, 36 నెలల పాటు ఎయిర్‌టెల్‌ రీఛార్జులు చేయించుకోవాలి. 18 నెలల తరవాత రూ.500, 36 నెలల తరవాత 1,000 రూపాయలు ఖాతాదారుకు వాపసు ఇస్తారు. అంటే ఫోన్‌కు చెల్లించింది రూ.1,649 మాత్రమే అవుతుంది. నెలకు రూ.169 రీఛార్జి వద్దనుకుంటే, తొలి 18 నెలల్లో రూ.3,000, తదుపరి 18 నెలల్లో మరో రూ.3000 చొప్పున రీఛార్జి చేసుకోవాలి. అప్పుడే నగదు వాపసు లభిస్తుంది. మరో రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా ఈ పథకంలో ఉన్నాయి. ఇంటెక్స్‌ ఆక్వా 4ఏ ధర రూ.4,999 కాగా, రూ.1,999కి లభిస్తుంది. 2జీబీ ర్యామ్‌, 16 జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఆక్వా ఎస్‌3 ధర రూ.6,649 కాగా, రూ.4,379కి ఇదే తరహాలో లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *