కేంద్ర బడ్జెట్‌‌పై నారా బ్రహ్మణి ఆసక్తికర వ్యాఖ్యలు..?

Interesting comments on Nara Brahmani on the Union Budget

Interesting comments on Nara Brahmani on the Union Budget

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రహ్మణి స్పందించారు. ఇన్‌స్టూట్ ఆఫ్ ‌‌డైరెక్టర్స్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాపులో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రహ్మణి బడ్జెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.! బడ్జెట్‌లో డైరీ, ఆక్వాతోపాటు వ్యవసాయ రంగాలకు పెద్ద పీటవేయడం శుభపరిణామం అని బ్రాహ్మణి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ ఆశాజనకంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.
కిసాన్ కార్డులు వ్యవసాయదారులకే కాకుండా ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. అలాగే, ఈ ఏడాది మత్స్య, పాడి పరిశ్రమ కోసం మరో 10 వేల కోట్లు అదనంగా కేటాయించారని చెప్పారు. డైరెక్టర్ లిస్టెడ్ కంపెనీ బోర్డులో మహిళ సభ్యురాలిగా ఉండాలని 2013లో తప్పనిసరి చేయడం శుభపరిణామం అని ఆమె తెలిపారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖ ఐటీ రంగంలో అభివృద్ది చెందుతోందని బ్రాహ్మణి తెలిపారు.
కాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా రేపు జరగనున్న టీడీపీ నేతల ప్రత్యేక భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.