కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సీఎం వల్లే అన్యాయం!

In the Union Budget,

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగడానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని విపక్ష నేత జగన్‌ ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన శనివారం నెల్లూరు రూరల్‌ మండలం సౌత్‌ మోపూరు గ్రామంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ‘‘బడ్జెట్‌ ప్రవేశపెట్టేముందు కేంద్రం ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులతో చర్చిస్తుంది. ఈ చర్చలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుతో ఒప్పందాలు జరిగాకే పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కానీ… చంద్రబాబు బడ్జెట్‌లో అన్యాయమంటూ ప్రకటనలు చేయడం ఆశ్చర్యకరం’’ అని విమర్శించారు.