Flipkart కొత్త ఏడాదిలో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు

offers on mobile phones in the new year

Flipkart offers on mobile phones in the new year

నూతన సంవత్సరంలో వినియోగదారుల కోసం ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్‌ ఫోన్లపై భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకురానుంది. 2018 జనవరి 3 నుంచి 5 వరకు వివిధ రకాల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కంట్‌ ఇవ్వనుంది. కేవలం రూ. 99కే బైబ్యాక్‌ గ్యారంటీ సదుపాయాన్ని కల్పిస్తూ వినియోగదారుల పాత ఫోన్లకి పూర్తిగా 50 శాతం వరకు చెల్లించనుంది. నోకాస్ట్‌ ఈఏంఐ సదుపాయాన్ని కల్పిస్తూ పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకునేవారికి కంపెనీ షరతుల మేరకు పూర్తిగా రూ. 18వేల వరకు చెల్లించే అవకాశముంది. భారత్‌లో ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్‌ఫోన్లలో షియోమీ నోట్‌ 4 ఒకటి. రూ. 12,999 ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 10,999కి లభించనుంది. అదే వరుసలో రూ. 14,999 విలువ చేసే షియోమీ ఏ1 రూ. 12,999కి లభించనుంది.

గూగుల్‌ పిక్సెల్‌2 పై రూ. 13,001, పిక్సెల్‌2 ఎక్స్‌ఎల్‌పై రూ. 8,001 డిస్కౌంట్‌ లభించనుంది. వారి పాత మొబైల్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేసి కొత్త పిక్సెల్‌ 2ఎక్స్‌ఎల్‌ కొనే వినియోగదారులకు అదనంగా మరో రూ.4 వేలు తగ్గనుంది. ఇదే వరుసలో మోటో జీ5 ప్లస్‌, మోటో సీ, మోటో సీ ప్లస్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7, గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌(16జీబీ) తదితర స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లు ప్రకటించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *