దేవుడిని కలవాలనుకుంటే..మెసేజ్‌ చేయండి!

ఇరాన్‌: ఆలయానికి వెళ్తే అక్కడి దేవుడిని దర్శించుకుని ఆయనతో మన బాధలు చెప్పుకొంటూ ఉంటాం. కానీ, దేవుడిని ఎలా కలుస్తాం? అనుకుంటున్నారా? ఇరాన్‌కు చెందిన ఓ పూజారి ఆలయానికి వచ్చే భక్తులకు ఇచ్చిన సందేశమిది. వివరాల్లోకెళితే.. ఇరాన్‌లో ఫైర్‌ అనే ఓ ఆలయం ఉంది. జొరాస్ట్రియన్‌ మతానికి చెందిన వారు ఈ ఆలయానికి ఎక్కువగా వెళుతుంటారు. భారత్‌లోనూ ఈ ఆలయాలు ఉన్నాయి. అయితే ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా సెల్‌ఫోన్లు తెస్తున్నారని, దాని వల్ల ప్రశాంతత లేకుండా పోతోందని ఆలయంలోని పూజారి భావించాడు.

ఇందుకోసం గుడి బయట ఓ నోటీస్‌ పెట్టించాడు. దానిపై ‘మీరు ఈ ఫైర్‌ ఆలయంలోకి అడుగుపెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాని అర్థం దేవుడు మీ ఫోన్లకు కాల్‌ చేస్తాడని కాదు. మీరు దేవుడితో మాట్లాడాలని అనుకుంటే ఆలయంలోకి అడుగుపెట్టాక ఓ మంచి స్థలాన్ని చూసుకుని అక్కడ కూర్చుని ఆయనతో మాట్లాడుకోండి. ఆయన్ని చూడాలనుకుంటే మీరు వాహనం నడిపేటప్పుడు దేవుడికి మెసేజ్ పెట్టండి’ అని వ్యంగంగా రాయించాడు. ఆలయం ఎదుట ఉన్న నోటీస్‌‌ను టారోనిష్‌ ఇరానీ అనే నెటిజన్‌ ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో ఈ ఫొటో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *