ఛలో తెలుగు సినిమా రివ్యూ

Chalo Telugu Movie Review

Chalo Telugu Movie Review

త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ గురువుగారి బాటలోనే మంచి కధ.. కధనాలు..కామెడీ సీన్లు…వాటితో పాటు మంచి మాటలు అన్నీ అన్నీ చక్కగా రాసుకున్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు…జాగ్రత్తగా గమనిస్తే ప్రతీ సన్నివేశంలోనూ తన కలం పదును చూపించి ప్రేక్షకుణ్ణి సీట్లో కూర్చోబెట్టాడు వెంకీ కుడుముల…సరైన స్క్రిప్ట్ ఎంచుకోవడానికి ఇబ్బంది పడుతున్న నాగసౌర్యకు ఇన్నాళ్ళకు తన ముందు సినిమాలను మించి మంచి సినిమాగా ఛలో మూవీని చెప్పుకోవచ్చు..కాకపోతే తన వాయిస్ ఇంకా మెరుగుపరచుకోవాలి…ఇక మహతి సాగర్ అభినవ మణిశర్మ లా అనిపించాడు…తెలుగు తెరకు మరో చిలిపి హీరోయిన్ దొరికింది రష్మీక రూపంలో…ఈ సినిమాకు పనిచేసిన కమెడియన్స్ అందరూ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు…సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం చాలా చక్కగా ఉంది…కొన్ని లాజిక్స్ ను పట్టించుకోపోతే యూత్ కు మంచి ఎంటర్టైనర్.. ఈ ఏడాది ప్రారంభంలో గురువు త్రివిక్రమ్ చిత్రంలో మిస్సయిన మార్క్…తన శిష్యుడి సినిమాలో నూటికి నూరు శాతం కనబడుతుంది…. ఛలో

ప్లస్ పాయింట్స్ : సినిమాకి మేజర్ ప్లస్ డైరెక్టర్ వెంకీ సినిమా ను నడిపించిన తీరు అని చెప్పాలి. ఆకట్టుకునే కథనం తో ఈ సినిమాను హిట్ సినిమా గా మలచడం లో చాలా వరకు విజయవంతం అయ్యాడనే చెప్పాలి. కామెడీ కూడా కధలో భాగంగా వస్తూ ప్రేక్షకులను ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా చేస్తుంది. హీరో నాగ శౌర్య తన నటనతో ఆకట్టుకున్నాడు. తన లుక్స్ , డ్రెస్ సెన్స్ తో టాలీవుడ్ లో మరో అందగాడు అని నిరూపించాడు. హీరోయిన్ రష్మీక తన నటనతో, అందంతో అలరిస్తుంది. మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ సినిమా కి తగ్గట్టుగా వినసొంపుగా ఉంది. బాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.నటీనటులు తమ పెరఫార్మన్స్ తో మెప్పించారు. నిర్మాణ విలువలు కు డోఖా లేదు.

మైనస్ పాయింట్స్: సినిమా లో కామెడీ ప్రధానం గా ఉన్నా సినిమాకి కీలక సన్నివేశం అయినా ఫ్లాష్ బాక్ లో కామెడీ ని పెట్టి చాలా సిల్లీ గా మార్చారు. దానివల్ల సినిమాలో తీవ్రత లోపించింది.సెకండాఫ్ కొంచెం నెమ్మదించింది. క్లైమాక్స్ ను హడావిడి గా ముగించేశారు అనిపిస్తుంది.

తీర్పు: మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఈ సినిమాకి”చలో”