(దంగ‌ల్ ఫేం) బాలీవుడ్‌ నటి జైరా వాసింకు చేదు అనుభవం

(Dangal Fame) Bollywood actress Jaira Vasim is a bad experience

(Dangal Fame) Bollywood actress Jaira Vasim is a bad experience
బాలీవుడ్‌ నటి జైరా వాసిం(దంగ‌ల్ ఫేం)కు చేదు అనుభవం ఎదురైంది. జైరా శనివారం దిల్లీ నుంచి ముంబయికి వెళుతున్న విస్తారా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణిస్తుండగా తోటి ప్రయాణికుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఈ విషయాన్ని జైరా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడిస్తూ వీడియో పోస్ట్‌ చేసింది. సీట్‌లో నిద్రపోతున్నప్పుడు వెనకే ఉన్న వ్యక్తి తన కాలు తొక్కుతూ అసభ్యంగా ప్రవర్తించాడని వివరిస్తూ కన్నీరుపెట్టుకుంది. ‘ఇప్పుడు ముంబయి చేరుకున్నాను. ప్రయాణంలో ఓ వ్యక్తి నాతో ప్రవర్తించిన తీరు చాలా అసభ్యకరంగా ఉంది. ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదు. అమ్మాయిలకు విస్తారా ఎయిర్‌లైన్స్‌ ఎలాంటి భద్రత కల్పిస్తోందో ఈ ఘటనతో అర్థమవుతోంది. మనకు మనం సాయం చేసుకోకపోతే ఇంకెవ్వరూ సాయపడరు. ఇది చాలా నీచమైన ఘటన.’

‘అతని ఫొటో తీయాలనుకున్నాను. కానీ లైట్లు లేకపోవడంతో ఫొటో సరిగ్గా రాలేదు. అతని ప్రవర్తన చూసి విమానం కదులుతున్నందుకు అలా చేస్తున్నాడనిపించి వూరుకున్నాను. ఆ తర్వాత చూస్తే అతను కావాలనే అలా చేస్తున్నట్లు కనిపించింది. అతను కూర్చున్న తీరు కూడా వికృతంగాఉంది.’ అని వివరించింది జైరా. దీనిపై విస్తారా ఎయిర్‌లైన్స్‌ స్పందిస్తూ విచారణ చేపడతామని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *