ఆనంకు అరెస్ట్ వారెంట్

Anam viveka Arrest Warrant

Anam viveka Arrest Warrant

ఏపీ టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి హైదరాబాద్ నగరంలోని ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చింది.! గతంలో వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా.. ఆనంపై డిఫమేషన్‌‌ వేసిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్‌‌గా తీసుకున్న కోర్టు శుక్రవారం సాయంత్రం ఆనంకు అరెస్ట్ వారెంట్‌ జారీచేసింది. అయితే ఈ కేసులో పోలీసులు ఏవిధంగా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే. కాగా.. గతంలో పలుమార్లు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆనం చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని నాంపల్లి కోర్టులో ఎమ్మెల్యే రోజా కేసు కూడా దాఖలు చేశారు. దీంతో సమన్లు జారీచేసిన కోర్టు వివరణ ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే.