ముఖ్యమంత్రి చంద్రబాబుకి అమిత్ షా ఫోన్‌

Amit Shah phone to Chief Minister Chandrababu

 

ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇవాళ జరగబోయే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. త్వరలోనే అన్ని విషయాలపై చర్చిద్దామని అమిత్‌షా అన్నారు. ఇటీవల కేంద్రం ప్రదేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రత్యేకత చూపలేదని, ఈ బడ్జెట్ చాలా నిరాశగా ఉందని సీఎం చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర నిరాస చెందారు. అమరావతికి నిధులు వంటి అంశాల ప్రస్తావన లేకపోవడం విచారం కలిగించిందని వాపోయారు. పోలవరం ప్రాజెక్ట్‌కి నిధుల సమీకరణ నాబార్డు ద్వారా ఏర్పాటు చేశారు..కానీ నిధుల ప్రవాహమేమీ చెప్పుకోదగిన రీతిలో లేదన్నారు. ఎక్కడెక్కడో మెట్రోలు ఇచ్చారు కానీ విజయవాడ, విశాఖపట్నం నగరాలకు మెట్రో ప్రస్తావన, రైల్వే జోన్ లేదని మండిపడ్డారు. మొత్తంగా ఈ బడ్జెట్ మీద నిరాశగా ఉన్నామని చెప్పారు. మరో వైపు ఏపీకి అన్నివిధాల కేంద్రం నిధులు మంజూరు చేస్తూ ఆదుకుంటుందని ఏపీ బీజేపీ నేతలు ప్రచారం చేస్తూ, టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో తెగతెంపులు చేసుకోవడమా? లేక మిత్ర పక్షంగా కొనసాగుతూ పోరాటం చేయాలన్నదానిపై ఆదివారం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీపీ సమాశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడతో అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *