అజ్ఞాతవాసి రివ్యూ

Agnyaathavaasi (Agnathavasi) Review...Pawan Kalyan..Latest Telugu Cinema

Agnyaathavaasi (Agnathavasi) Review…Pawan Kalyan..Latest Telugu Cinema

అజ్ఞాతవాసి…
భయంకరమైన టైటిల్…ఓ గొప్ప దర్శకుడు..పవన్ కళ్యాణ్ ఇరవైఐదవ సినిమా…అంతకు మించి.. ఇంకా..అంతకు మించి అంచనాలతో హాల్లోకి అడుగుపెట్టిన ప్రేక్షకుడు..బహుశా ఇక్కడే కాస్తంత టెన్షన్ పడ్డారేమో ఈ మిత్రద్వయం అనిపిస్తుంది..సినిమా పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఒక్కడే ఈ భారమంతా మోసాడే అనిపిస్తుంది.. సాదాసీదా కధ..సరిగ్గా లేని కధనం.. ఎప్పుడూ తన మాటలతో రక్తి కట్టించే మాటల మాంత్రికుడి పెన్ను సరిగ్గా పనిచేయలేదనే చెప్పాలి..ఈ సినిమాకు అసలు మైనస్ పాటలు…దేవి ని కాదని అరవ అనిరుధ్ ని ఎందుకు అరువు తెచ్చుకున్నారో తెలీదు కానీ ఆ వెలితి అచ్చంగా తెరపై కనబడుతుంది..యాక్షన్ సన్నివేశాలు బావున్నాయి..త్రివిక్రమ్ కు జ్ఞానం ఎక్కువైపోయి.. తెలుగు ప్రేక్షకుడి స్థాయిని దాటిపోయి రాసుకున్న కొన్ని సన్నివేశాలు మనకు కొంత ఉక్కిరిబిక్కిరిగా కనిపిస్తాయి..హీరోయిన్ల అభినయం పర్వాలేదు…కొడకా..కొటేశ్వర్రావా పాట ఒకటే బాగుంది…మణికంఠన్ ఫోటోగ్రఫీ అందంగా ఉంది…
చివరిగా చిన్నమాట…
త్రివిక్రమ్ సినిమాలు ఎప్పుడూ గుండెను తాకుతాయి.. కళ్ళను తడుపుతాయి..మనిషిని కదిలిస్తాయి…మనతోనే ఉంటాయి…! ఆ కోవకు మాత్రం ఈ సినిమా చెందినది కాదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *